Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమ గోదావరి: గోదారి ఉగ్రరూపం.. ఏజెన్సీల్లో ముంపు భయం, 40 గ్రామాలకు రాకపోకలు కట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి

agency villages submerged in godavari water in west godavari district
Author
Eluru, First Published Sep 9, 2021, 2:50 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో  భారీ వర్షాలకు వాగులు, వంకలు  పొంగుతున్నాయి. బ్రిడ్జీలు కుంగుతున్నాయి. రహదారులు గుంటలు పడుతున్నాయి. వందల ఎకరాల  పంట పొలాలు నీటమునిగాయి. 

కుక్కునూరు మండలం, దాచారం వద్ద గుండేటి వాగు వంతెనపైకి వర్షం నీరు చేరడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దు వాగు కాజ్వేపై గోదావరి వరద నీరు చేరింది. దీంతో ఏజెన్సీలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు లోతు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీగా కరెంట్ స్తంభాలు నీటమునిగాయి. ఈ ఏడాదిలో గోదావరి మూడోసారి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా గురువారం రాత్రికి గోదావరి నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios