ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా శుక్రవారం సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. గురువారం విజయవాడ వేదికగా జగన్... సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫస్ట్ టైమ్ జగన్ సచివాలయానికి వస్తున్నారు. 

శుక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని ఇదివరకే పార్టీ శ్రేణులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసుకున్నారు.
 
కాగా.. ఇప్పటికే సచివాలయంలో సీఎం చాంబర్‌ను సరికొత్తగా ముస్తాబు చేశారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌లతో పాటు సీఎం నేమ్ ప్లేట్‌, సీఎం కాన్వాయ్ రూట్లను సుబ్బారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. అంతేకాకుండా సీఎం చాంబర్‌లో మార్పులు చేర్పులు, సీఎం నేమ్ ప్లేట్ తీరుతెన్నులను ఆయన నిశితంగా పరిశీలించారు. వైవీ ఆమోదించిన తర్వాతే పలు మార్పులను ఖరారు చేయడం జరిగింది.