ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించింది.

అయితే నీలం సాహ్ని సేవలు వినియోగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆమెను తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.