హైదరాబాదు: వైఎస్సార్ కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగలనుంది. పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేయనున్నారు. ఆయన మంగళవారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది.

కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. అయితే, ఆయన పార్టీ నుంచి వైదొలగాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. 

ఆదిశేషగిరి రావు తెలుగు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు. ఆదిశేషగిరి రావు గతంలో కాంగ్రెసులో పనిచేశారు.