ఇది పీపుల్స్ కేపిటల్: ఆర్-5 జోన్ పై హైకోర్టు తీర్పు తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్

 హైకోర్టు తీర్పుతో ఆర్-5 లో    ఇళ్ల స్థలాలు ఇచ్చే  ప్రక్రియకు అడ్డంకులు తొలిగాయని  అడిషనల్ అడ్వకేట్ జనరల్  సుధాకర్  రెడ్డి  చెప్పారు. 

Additional Advocate General Sudhakar Reddy Responds on  Ap High Court  Verdict  Ovr R5  zone lns

అమరావతి: ఆర్-5 జోన్ లో  ఇళ్ల స్థలాల  పట్టాల పంపిణీకి  అడ్డంకులు తొలగిపోయాయని  అడిషనల్ పీపీ  పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆర్-5 జోన్ పై  మధ్యంతర ఉత్తర్వులు  ఇవ్వాలని  అమరావతి రైతులు  దాఖలు  చేసిన అనుబంధ పిటిషన్లను  ఏపీ హైకోర్టు  ఇవాళ కొట్టివేసింది.  కోర్టు తీర్పు వెలువడిన తర్వాత  అడిషనల్  అడ్వకేట్ జనరల్  సుధాకర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఇళ్ల స్థలాల పంపిణీకి  మార్గం సుగమమైందన్నారు.  ఇది  పేదలు సాధించిన విజయంగా  ఆయన పేర్కొన్నారు. సీఆర్ డీఏ  ప్రకారం మాస్టర్ ప్లాన్  చేయలేదని  సుధాకర్ రెడ్డి  చెప్పారు.

అమరావతి  త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా  ఏపీ ప్రభుత్వం  వ్యవహరిస్తుందని  అమరావతి రైతుల తరపు న్యాయవాదులు వాదించారన్నారు.  అమరావతి త్రిసభ్య ధర్మాసనం   తీర్పునకు  అనుగుణంగానే  పేదలకు  ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని  చేపట్టాలని  నిర్ణయించినట్టుగా  తాము కోర్టు ముందు వాదించామన్నారు. 

also read:ఆర్-5 జోన్‌పై అన్యాయమైన డిమాండ్‌ను కొట్టేసింది: హైకోర్టు తీర్పుపై సజ్జల
ఇది పీపుల్స్ కేపిటల్  అని ఆయన పేర్కొన్నారు.  అమరావతి. పెట్టుబడిదారుల  రాజధాని కాదన్నారు. పేదలకు  మంచి చేయాలనే జగన్ ఆదేశాలను అడ్డుకొనేందుకు  చంద్రబాబు శతవిధాల  ప్రయత్నించారని  సుధాకర్ రెడ్డి  ఆరోపించారు. రాజధానిలో  35 శాతం  మంది పేదలకు  ఇళ్ల పట్టాలు  ఇవ్వాలనే నిబంధనను  చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios