Asianet News TeluguAsianet News Telugu

'ఓ మహిళ పట్ల ఇంత నీచంగా మాట్లాడతారా.. ' : మంత్రి రోజాకు రమ్యకృష్ణ మద్దతు..

Actress Ramya Krishna: మంత్రి రోజాకు సినీ నటి రమ్యకృష్ణ మద్దతుగా నిలిచారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యరాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరమనీ, దేశం ఎంత ఎదిగినా మహిళలపై అన్ని రంగాల్లోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 

Actress Ramya Krishna Reacts on Bandaru Satyanarayana Comments on Roja KRJ
Author
First Published Oct 8, 2023, 12:40 AM IST

Actress Ramya Krishna: ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి రమ్య కృష్ణ స్పందించారు. మంత్రి రోజాకు రమ్యకృష్ణ మద్దతుగా నిలిచారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. ఎమ్మెల్యే రోజాపై చేసిన అసభ్య వ్యాఖ్యలు తనని తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అన్నారు. దేశం ఆర్థికంగా, నాగరికంగా ఎంత ఎదిగినా మహిళలపై అన్ని రంగాల్లోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయనీ,  ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని అన్నారు. ఈ మేరకు నటి రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
  
మంత్రి రోజాని టీడీపీ బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం చాలా బాధకరమనీ, మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని, మన దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ నటి రమ్యకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేసింది. బండారు సత్యనారాయణని క్షమించకూడని నేరమని, మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని,  అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

కులం, మతం, ప్రాంతం, లింగంతో సంబంధం లేకుండా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా  ఖండించాలని, తాను మహిళగా, నటిగా, తన స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలని,  బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios