Asianet News TeluguAsianet News Telugu

రాత్రి గెలిచాము ఉదయానికి ఓడిపోయాం.. ఏం జరిగిందో: బెజవాడలో హేమ వ్యాఖ్యలు

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై (vijayawada indrakeeladri temple) దుర్గమ్మను సినీనటి హేమ (hem) గురువారం దర్శించుకున్నారు. అనంతరం హేమ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

actress hema visits durgamma temple vijayawada
Author
Vijayawada, First Published Oct 14, 2021, 3:14 PM IST

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై (vijayawada indrakeeladri temple) దుర్గమ్మను సినీనటి హేమ (hem) గురువారం దర్శించుకున్నారు. అనంతరం హేమ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని ఆమె తెలిపారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. మా ఎలక్షన్స్‌లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలంటూ హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లోనే కాదు రాజకీయంలోనూ అడుగుపెట్టిన హేమ.. ఓటమి (మండపేట నియోజకవర్గం-2014) తరువాత మళ్లీ సినిమా రంగంలోనే కొనసాగింది. మా(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో వివాదాస్పదమవుతూ ఫైర్‌ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హేమ తాజా  మా ఎన్నికల్లో (maa elections) తొలుత అధ్యక్ష బరిలో నిలిచారు. అయితే తర్వాత పెద్దల సలహా, ప్రకాశ్ రాజ్ మంత్రాంగంతో పోటీ  నుంచి విరమించుకుని ప్రకాశ్ రాజ్ (prakash raj) ప్యానెల్ నుంచి పోటీ చేశారు. 

ALso Read:పోలీస్ స్టేషన్‌కు చేరిన ‘‘ మా ’’ పంచాయతీ: నరేశ్, కరాటే కల్యాణీలపై మాదాపూర్ పీఎస్‌లో హేమ ఫిర్యాదు

కాగా, మా ఎన్నికల కౌంటింగ్ రోజున హేమ తన చేయి కొరికింది అని శివ బాలాజీ (shiva balaji) కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది. నరేశ్ తో (naresh) పాటు మీడియా ముందుకు వచ్చిన శివ బాలాజీ.. హేమ నోటితో చేతిని కొరకారని గాయం చూపించడం జరిగింది. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో హేమ వివరణ ఇచ్చారు. తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో  చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతే తప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. 

కాగా, మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై మంచు విష్ణు (manchu vishnu) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే ఈసీ మెంబర్లుగా రెండు ప్యానెళ్ల నుంచి 18 మంది ఎన్నికయ్యారు. ఇందులో పది మంది మంచు విష్ణు ప్యానెల్ తరుపున గెలవగా.. మిగిలిన 8 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచారు. అయితే మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలాగే విష్ణుకు పనిలో ఎలాంటి ఆటంకం కలగకుండా వుండేందుకు గాను ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. 

 

"

Follow Us:
Download App:
  • android
  • ios