Asianet News TeluguAsianet News Telugu

మీ కళ్లు గద్దలు పొడవా, పౌరుషమున్న సీఎంవైతే... :జగన్ పై దివ్యవాణి ఫైర్

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పదేపదే కలుస్తున్నారని అయితే జగన్ ను దాసోహ పుత్రుడు అనాలా అంటూ ప్రశ్నించారు.

Actress divyavani serious comments on ap cm Ys jagan in chandrababu deeksha
Author
Vijayawada, First Published Nov 14, 2019, 4:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీనటి, టీడీపీ నేత దివ్యవాణి. విజయవాడలోని అలంకార్ సెంటర్ సమీపంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గొన్న ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

సినీనటులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్యాకేజీ స్టార్, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో అయితే బాధాకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇకపోతే వైసీపీ నేతలపై శాపనార్థాలు పెట్టారు దివ్యవాణి. వీళ్ల కళ్లు కాకిలెత్తుకుపోను, వీళ్ల కళ్లు గద్దలు పొడవా అంటూ రెచ్చిపోయారు. వైసీపీ నేతల అందరికళ్లు అచ్చెన్నాయుడుపైనే పడుతున్నాయంటూ మండిపడ్డారు. 

అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడమంటే నీబాబు సొమ్మేదో పెట్టి అచ్చెన్నాయుడుని పోషిస్తున్నట్లు ఆయనపై పడి ఏడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడులా అంతటి పర్సనాలిటీ రావాలంటే జిమ్ కు వెళ్లు అని హితవు పలికారు. 

వైసీపీ నేతలు మాట్లాడితే నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దాడులు విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. కడుపుమంటతో టీడీపీపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమెరికా వెళ్లినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వంగా బతుకుతున్నామని దివ్యవాణి తెలిపారు. 

అలాంటి తెలుగుభాషను ఈ రోజు కనుమరుగు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేశారు. ఇంగ్లీషు భాష ఉండాలని అందులో ఎలాంటి తప్పు లేదు అన్నారు. బతుకు దెరువు కోసం ఇంగ్లీషు భాష ఉండాలి కానీ తెలుగుభాషను లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ సహించేది లేదని హెచ్చరించారు. 

ఉచిత ఇసుక ఇవ్వకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఇసుకేసి తోమి తోమి ఇసుకలోనే పాతేస్తారని హెచ్చరించారు. నువ్వు నిజంగా పౌరుషం ఉన్న ముఖ్యమంత్రివి అయితే కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు కూల్చడం కాదని బడా నేతలకు చెందిన ఇళ్లలో నుంచి ఒక ఇటుక తీయాలని సవాల్ విసిరారు. 

చంద్రబాబు నాయుడు ఇంటిని కక్షగట్టి కూల్చాలని ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వేలాది కోట్ల మంది గుండెల్లో గూడుకట్టుకున్నారని ఆ ఇళ్లును ఎవరూ కూల్చలేరన్నారు. బడాబాబులకు చెందిన ఇంటి ఇటుకను కూలిస్తే తామంతా జగన్ కు దాసోహం అవుతామని తేల్చి చెప్పారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తుంటే వైసీపీ కడుపు మంటతో తట్టుకోలేకపోతుందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. 

జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పదేపదే కలుస్తున్నారని అయితే జగన్ ను దాసోహ పుత్రుడు అనాలా అంటూ ప్రశ్నించారు. చట్టపరంగా రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల గురించి పట్టించుకోకుండా తెలంగాణకు దొంగతనంగా ఇసుకను సరఫరా చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోవడంతో రాష్ట్రప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా అంతా భయపడుతున్నారని తెలిపారు. వచ్చిన ప్రతీవారు చెప్పేది ఒక్కటేనని ఏపీలో చావుకల, ప్రేతకల కనబడుతుందని దివ్యవాణి ఆరోపించారు. 

చేపలు రుద్దించుకున్నట్లు వైసీపీ ప్రభుత్వాన్ని రుద్దించుకోకుండా ఇసుకలో పాతరేసే పరిస్థితి తెచ్చుకోకుండా జగన్ మేల్కొనాలని సూచించారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఇసుకలో పాతరేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని దివ్యవాణి హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ ప్రభుత్వం ఇసుకను కూడా కబ్జా చేస్తోంది.. దీక్షలో చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios