రాష్ట్ర ప్రజలందిరికీ మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

వైసీపీ అధినేత జగన్ కి మద్దతుగా సినీనటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని విజయవాడలోని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు వీధుల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందిరికీ మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలనకు ముగింపు పలికేందుకు వైసీపీ నాయకులంతా ఉత్సాహంగా పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలన్నారు. వైఎస్‌ స్వర్ణయుగం రావాలంటే జగన్‌తోనే సాధ్యం అన్నారు. వెలంపల్లి మాట్లాడుతూ రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి వివరిస్తున్నామన్నారు.