హైదరాబాద్: ఇప్పట్లో తాను చనిపోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటుడు పోసాని కృష్ణమురళి. తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవేమనని ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. తాను ఇప్పట్లో చనిపోయే ప్రసక్తే లేదన్నారు. 

తనకు సినీ పరిశ్రమల పాత్రలు ఇవ్వొచ్చని, ప్రజలు తనకు ఫోన్ చేయవచ్చునని చెప్పుకొచ్చారు. నెల రోజులపాటు తాను అన్నం తినలేదని కండీషన్ సీరియస్ అయినప్పటికి భగవంతుడు బ్రతికించాడని చెప్పుకొచ్చారు. 

తాను సినీ పరిశ్రమకు లేదా ప్రజలకో లేకపోతే రాజకీయాలకు తాను ఇంకా సేవలు చేయాల్సి ఉందేమోనని అందుకే తనను బతికించి ఉంటారని తాను భావిస్తున్నట్లు పోసాని కృష్ణమురళీ తెలిపారు.