‘లక్ష్మీప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో నాకు యాభై యేళ్ల అనుబంధం ఉంది. అతను అమ్మను కోల్పోవడం నన్ను కలిచివేసింది’ అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం విషాదం అని.. లక్ష్మీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మోహన్ బాబు అన్నారు. 

క్రిష్ణాజిల్లా : ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను పెద్పారుపూడి మండలం వానపాముల గ్రామంలోని ఆయన స్వగృహంలో సినీనటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు పరామర్శించారు. 

"

ఈ మేరకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి yarlagadda lakshmi prasad నివాసానికి చేరుకున్నారు mohan babu. లక్ష్మీ ప్రసాద్ మాతృమూర్తి రంగనాయకమ్మ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు మోహన్ బాబు. 

అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ... ‘లక్ష్మీప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో నాకు యాభై యేళ్ల అనుబంధం ఉంది. అతను అమ్మను కోల్పోవడం నన్ను కలిచివేసింది’ అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం విషాదం అని.. లక్ష్మీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 

మాతృమూర్తి Ranganayakamma పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఆ తరువాత లక్ష్మీ ప్రసాద్ కుటుంబంతో మోహన్ బాబు కాసేపు ముచ్చటించారు. 

ఈ నెల 17న మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు మాతృవియోగం కలిగింది. లక్ష్మీ ప్రసాద్ మాతృమూర్తి రంగనాయకమ్మ (84) స్వగ్రామంలోని తన ఇంట్లో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందారు. స్వగ్రామం వానపాముల గ్రామంలోనే ఆమె మరణించారు.

లక్ష్మీప్రసాద్ కు మాతృవియోగానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రంగనాయకమ్మకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ లు వానపాముల గ్రామాన్ని సందర్శించారు. రంగనాయకమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. యార్లగడ్డ కుటుంబానికి సంతాపం తెలిపారు. 

Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్‌కు సెలవు..

ఇదిలా ఉండగా, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2021, ఆగస్ట్ లో పొడిగించింది. ఈ మేరకు యార్లగడ్డ పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో యార్లగడ్డ 2023 ఆగస్టు 25 వరకు పదవిలో కొనసాగనున్నారు. యార్లగడ్డకు ఏపీ క్యాబినెట్ హోదాతో పాటు మంత్రులకు లభించే జీతభత్యాలు, ఇతర సదుపాయాలు వర్తిస్తాయని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజన అభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

యార్లగడ్డ 2019 ఆగస్టులో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆచార్య యార్లగడ్డ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మశ్రీ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. రాజ్యసభ సభ్యులుగానూ పనిచేశారు. తెలుగుతో పాటు హిందీ సాహిత్య రంగాల‌కు ఆయన చేసిన సేవ‌లు ఎనలేనివి. ద‌క్షిణాదికి చెందిన హిందీ భాషాభిమానిగా అచార్య యార్లగడ్డ గుర్తింపు సాధించారు. 1996-2002 మ‌ధ్య కాలంలో రాజ్యస‌భ స‌భ్యునిగా ఉన్న సమయంలో పార్లమెంటరీ అధికార భాషా సంఘానికి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ స‌మీపంలోని వాన‌పాముల‌.