ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆచంట ఒకటి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కొనసాగుతున్నారు. మంత్రి పోటీచేస్తున్న నియోజకవర్గం కావడంతో ఆచంట అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

ఆచంట రాజకీయాలు :

ఆచంట నియోజకవర్గంలో మొదట కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పోటీ వుండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా కొంతకాలం ఆచంట రాజకీయాలు ఇలాగే సాగాయి. అయితే మెల్లిగా నియోజకవర్గంపై పట్టు సాధించిన టిడిపి 1999 తర్వాత గెలుపుబాట పట్టింది. అంతకుముందు 1983లో మాత్రమే ఆచంటలో టిడిపి గెలిచింది. 

1983 లో కోట భాస్కరరావు, 1999 లో జోహార్ మోచర్లచ 2004 లో పీతల సుజాత, 2014లో పితాని సత్యనారాయణ టిడిపి నుండి గెలిచి ఆచంట ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 2014లో పోటీచేసి ఓడినా 2019లో వైసిపి హవా వీయడంతో ఆచంట నుండి శ్రీరంగనాథరాజు గెలిచి ఏకంగా వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిపదవి సాధించాడు.

ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పెనుగొండ
2. ఆచంట
3. పెనుగంచిప్రోలు
4. పోడూరు

ఆచంట అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,74,308
పురుషులు - 86,323
మహిళలు ‌- 87,984

ఆచంట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మరోసారి ఆచంట నుండి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చిన వైసిపి ఆచంటలో ఆ సాహసం చేయలేకపోయింది. 

టిడిపి అభ్యర్థి :

మరోసారి మాజీ మంత్రి పితాని సత్యనారాయణను ఆచంట పోటీలో నిలిపింది టిడిపి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా పితానిపైనే టిడిపి నమ్మకం పెట్టుకుంది. 

ఆచంట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఆచంట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,494 (81 శాతం)

వైసిపి - చెరుకువాడ శ్రీరంగనాథరాజు - 66,494 ఓట్లు (47 శాతం) - 12,886 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - పితాని సత్యనారాయణ - 53,608 (38 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - జవ్వాది వెంకట విజయరామ్ - 13,993 (16 శాతం) - ఓటమి

ఆచంట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,30,599 (81 శాతం)

టిడిపి - పితాని సత్యనారాయణ - 63,549 (48 శాతం) ‌- 3,920 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ముద్నూరి ప్రసాదరాజు - 59,629 (45 శాతం) - ఓటమి