ఆంధ్రప్రదేశ్ లో మరో కర్మాగారంలో ప్రమాదం జరిగింది. గ్రీన్ టెక్ ఎన్విరో సొల్యూషన్స్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో కర్మాగారంలో ప్రమాదం జరిగింది. గ్రీన్ టెక్ ఎన్విరో సొల్యూషన్స్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామ పరిధిలోని గ్రీన్ టెక్ ఎన్విరో సొల్యూషన్స్ కర్మాగారంలో ముగ్గురు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
"
కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న రసాయన కర్మాగారంలో నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వైజాగ్ విషవాయువు ఘటనలా మారుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కర్మాగారంలో డ్రమ్ములోని రసాయనాలను బాయిలర్ లో పోసేందుకు డ్రమ్ ల మూతలు తీసిన టైంలో విషయవాయువులు వెలువడి సునీల్, సంతోష్, సంజయ్ కుమార్ అనే ముగ్గురు కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో సంజయ్ కుమార్ కు మూర్ఛ రావడంతో వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సమాచారం తెలిసిన ఐద్వా నాయకులు అస్వస్థత గురైన కార్మికులకు సహాయం అందించి, వెంటనే తాసిల్దార్ కు సమాచారం అందజేశారు. దాంతో తాహాసిల్దార్ ఆదేశాలతో రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, విఆర్ఓ లు కర్మాగారం వద్దకు వచ్చి విచారించారు.
కర్మాగార యజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు ఈ సమస్య పై సత్వరమే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2021, 1:48 PM IST