విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో చోటు చేసుకొన్న అక్రమాలను ఏసీబీ, విజిలెన్స్ రిపోర్టులు బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ ప్రాథమిక నివేదికను సిద్దం చేశాయి.

దుర్గ గుడిలో చీరల విభాగంలో అక్రమాలను ఏసీబీ నివేదిక తేటతెల్లం చేసింది.  చీరల ధరలు, బార్ కోడింగ్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న విషయాన్ని ఏసీబీ గుర్తించింది.అమ్మవారికి భక్తులు చీరెలు సమర్పిస్తారు. పట్టు చీరెలతో పాటు ఇతర చీరెలను కూడ భక్తులు అమ్మవారికి బహుకరిస్తారు. 

పట్టు చీరెల విభాగంలో రూ. 7 వేల, రూ. 35 వేల చీరెలు కన్పించకుండా పోయినట్టుగా ఏసీబీ నివేదిక తెలుపుతోంది. రూ. 15 వేల విలువైన చీర ధరను రూ. 2500 గా ముద్రించారు.

ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పటికే 20 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు ఈ దేవాలయంలో అక్రమాలపై ఈవో సురేష్ బాబు పాత్రను ఏసీబీ అందించింది. తుది నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి ఏసీబీ అందించనుంది.  ఈ నివేదికల్లో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.