విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు ఏసిబి చేతికి చిక్కారు. ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏసిబి ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ క్రమంలోనే తహసిల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షల రూపాయలు, డిప్యూటీ తహసిల్దార్ కారులో లక్ష రూపాయలను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. 

ఇక ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, లంచాలు తీసుకుంటున్న వారి వివరాలను ఏసిబి అధికారులు సేకరిస్తున్నారు. 

వీడియో

"