విశాఖలో మరో అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కర్రీ నాగేశ్వరరావు ఆధాయానికి మించిన ఆస్తుల కేసులో బుక్కయ్యాడు. ఇప్పటి వరకు కోటి 80 లక్షల విలువైన ఆస్తుల్ని గుర్తించారు అధికారులు.

విశాఖ నగరంలోని రిషికొండ తారక రామారావు లే ఔట్, యలమంచిలిలోని బంధువుల ఇళ్లలో ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.