విజయవాడ దుర్గగుడి: ఏసీబీ అధికారుల సోదాలు

విజయవాడ దుర్గగుడి ఆలయంలో  ఇవాళ  కూడా  ఏసీబీ అధికారులు  సోదాలు నిర్వహించారు.  

ACB Raids  in Vijayawada   Durga Temple  lns

విజయవాడ:  ఇంద్రీకీలాద్రి  ఆలయంలో  ఆదివారంనాడు  ఏసీబీ అధికారులు  సోదాలు  నిర్వహించారు.  ఇటీవలనే   ఇంద్రీకీలాద్రి  ఆలయంలో  సూపరింటెండ్ గా  పనిచేసిన  నగేష్  ఇంటిపై  ఏసీబీ అధికారులు  సోదాలు నిర్వహించారు. నగేష్ నివాసంలో  భారీగా ఆస్తులు గుర్తించారు.  రెండు  రోజుల తనిఖీల తర్వాత  ఏసీబీ అధికారులు నగేష్ ను అరెస్ట్  చేశారు.  నగేష్   కేసులో భాగంగానే  ఇవాళ ఏసీబీ అధికారులు  విజయవాడ దుర్గగుడిలో సోదాలు నిర్వహించారని  సమాచారం. 

ఇదిలా ఉంటే ఇంద్రకీలాద్రి ఆలయంలో  ఉద్యోగుల  అక్రమాలపై  విచారణ  జరిపించాలని  దుర్గగుడి  చైర్మెన్   సీఎం జగన్ కు వినతి పత్రం అందించారు.  ఇంద్రకీలాద్రి   ఆలయంలోని  ప్రసాదం కౌంటర్ ను   ఏసీబీ అధికారులు  పరిశీలించారు. 

గత వారంలో  ఏపీ రాష్ట్రంలో  ఆదాయానికి  మించి ఆస్తులున్నాయనే  ఆరోపణలున్న ముగ్గురు అధికారుల ఇళ్లపై  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.  విజయవాడ దుర్గగుడి సూపరింటెెండ్  నగేష్, విజయవాడ  పటమట రిజిస్ట్రార్  , కర్నూల్ జిల్లాకు చెందిన మరో రిజిస్ట్రార్  సుజాత   ఇళ్లపై  ఏసీీబ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ముగ్గురు అధికారులను  ఏసీబీ  అధికారులు  అరెస్ట్  చేశారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి  అమ్మవారి ఆలయంలో సూపరింటెండ్ గా  పనిచేసిన నగేష్ పై  గతంలో ద్వారకా తిరుమల ఆలయంలో పనిచేసిన  సమయంలో వచ్చిన  ఆరోపణలను  దుర్గుగుడి  అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని  దుర్గగుడి  చైర్మెన్  సీఎం జగన్ కు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు.  ఈ విషయమై  విజయవాడ దుర్గగుడి  ఈఓపై  ఆయన  ఆరోపణలు  చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios