తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం బయలు దేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయన్ కు ఓ మహిళ అడ్డుపడింది. 

జగన్ కాన్వాయ్ కు ఆ మహిళ అడ్డుపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకుంటుండగా వైయస్ జగన్ గమనించారు. ఆ మహిళను తన వద్దుకు పిలిపించుకున్నారు వైయస్ జగన్. ఆమెతో మాట్లాడారు. 

కాన్వాయ్ కు అడ్డుపడాల్సిన అంశంపై ప్రశ్నించారు. తన భర్తకు ఉద్యోగం కావాలని ఆ మహిళ జగన్ కు విజ్ఞప్తి చేసింది. తనకుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని తన భర్తకు ఉపాధి కల్పిస్తే బతుకుతామంటూ జగన్ కు మెురపెట్టుకుంది. జగన్ ఆమెకు భరోసా ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది.