తిరుమలలో చిన్నారి లక్షితపై దాడి చేసి, హతమార్చిన చిరుత ఫారెస్టు అధికారులకు చిక్కింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ఓ బోనులో అది చిక్కుకుంది.

తిరుమలలో నాలుగు రోజుల కిందట ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంతో పాటు సమీపంలోని మూడు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. అయితే ఆ చిరుత తిరుమల నుంచి అలిపిరికి కాలినడకన వెళ్లే మార్గంలో ఉన్న బోనులోకి వెళ్లింది.

పంజాబ్ లో పాక్ చొరబాటుదారుడిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. స్వతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఘటన

సోమవారం తెల్లవారుజామున ఏడో మైలు వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు. కాగా.. బాలికపై చిరుత దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించింది. ఆరేళ్ల లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు శుక్రవారం వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ కుటుంబం కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలని భావించింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో వారంతా నడుస్తున్నారు. 

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి.. నంద్యాలలో ఘటన

వీరంతా నడుస్తున్న క్రమంలో లక్షిత వారి కంటే వేగంగా ముందుకు వెళ్లింది. తరవాత కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. తమ పాట కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపడితే లక్షిత తీవ్ర గాయాలతో మరణించి కనిపించింది. దీంతో బాలికపై చిరుత దాడి చేసి చంపేసిందని అధికారులు నిర్దారణకు వచ్చారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నడక మార్గంలో భక్తుల భద్రతకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. భక్తులను గుంపులుగా గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలుంటే నడక మార్గంలో నిరాకరిస్తున్నారు.