నంద్యాలలో అడవిపందులకు భయపడిన ఆవుల మంద జలాశయంలోకి దూకింది. ఇది గమనించిన మత్స్యకారులు 400 ఆవులను ఒడ్డుకు చేర్చారు. 

నంద్యాల : నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అడవి పందులు చూసి బెదిరిపోయిన వందలాది ఆవులు తెలుగుగంగ జలాశయంలో దూకాయి. ఈ ఘటన శుక్రవారం నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటుచేసుకుంది. వాటిలో 400 గోవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, ఆర్ వెంకటరమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం, ఈశ్వర్, మురుగయ్య, సాంబకోటి సుమారు వెయ్యి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరు గ్రామ సమీపంలోని తెలుగుగంగ జలాశయం పక్కనున్న మైదాన ప్రాంతంలో ఆవుల మందను నిలిపారు.

ఆ సమయంలో అటువైపు ఒక అడవి పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. ఇది చూసిన ఆవులు బెదిరి పోయాయి. దీంతో కాపారులు ఆపుతున్నా.. పరుగులు పెడుతూ.. సుమారు ఐదువందల ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీయగా… మరో 450 వరకు జలాశయంలోకి దూకేశాయి. వాటి యజమానులు మత్స్యకారుల సహాయంతో నాటు పడవలు పుట్టిలపై జలాశయంలోకి వెళ్లి ఒడ్డుకు తోలుకుంటూ వచ్చారు. సి ఐ., ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. 

కామారెడ్డిలో ఒకే విద్యార్థిని.. మూడుసార్లు కాటేసిన పాము.. !