అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 67 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,717కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరమాల సంఖ్య 34కు చేరుకుంది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో 8,263 మందికి పరీక్షలు నిర్వహించగా 67 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు  నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 589 మంది డిశ్చార్జీ కాగా, 1094 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

కర్నూలులో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో 516 కేసులతో రాష్ట్రంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లా 351 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు రికార్డు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. 

కర్నూలు జిల్లాలో పది కరోనా వైరస్ మరణాలు సంభవించగా, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 9 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో 3గురు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 80
చిత్తూరు 82
తూర్పు గోదావరి 45
గుంటూరు 351
కడప 89
కృష్ణా 286
కర్నూలు 516
నెల్లూరు 92
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 37
పశ్చిమ గోదావరి 59