కాలికి వేసుకున్న చెప్పు ఓ నిండుప్రాణాన్ని తీసింది. ఈ ఘటన శ్రీకాకుళం చిల్లా వీరఘట్టంలో జరిగింది. ఆటోలో వెడుతుంటూ కాలి చెప్పు జారి కిందపడడంతో దానికోసం కదులుతున్న ఆటోనుండి దిగబోయి కిందపడి ఓ వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

కాలికి వేసుకున్న చెప్పు ఓ నిండుప్రాణాన్ని తీసింది. ఈ ఘటన శ్రీకాకుళం చిల్లా వీరఘట్టంలో జరిగింది. ఆటోలో వెడుతుంటూ కాలి చెప్పు జారి కిందపడడంతో దానికోసం కదులుతున్న ఆటోనుండి దిగబోయి కిందపడి ఓ వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

వండవ జంక్షన్‌కు సమీపంలోని శివాలయం దగ్గర ఈ సంఘటన సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఎచ్చెర్ల పెద్దఅప్పడు (61) అనే వృద్ధుడు చనిపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అప్పడి భార్య నరసమ్మ మధ్యాహ్నం కూర కోసం చికెన్‌ తీసుకురమ్మని చెప్పింది. 

దీంతో అప్పడు వండవ జంక్షన్‌లో ఉన్న షాపుకు వెళ్లి అరకిలో చికెన్ కొనుక్కుని ఆటోలో ఇంటికి బయలుదేరాడు. ఆటో కదిలి కొంత దూరం వెళ్లాక ఆటోలో వెనుకాల కూర్చన్న అప్పడి కాలి చెప్పు జారి కిందపడింది. 

దీంతో అది తీసుకోవాలన్న తొందరలో కదులుతున్న ఆటోనుంచి కిందికి దూకాడు. బాలెన్స్ తప్పి అతని తల బలంగా రోడ్డుకు గుద్దుకోవడంతో బాగా రక్తం పోయింది. ఇది గమనించిన స్థానికులు, ఆటోలోని తోటి ప్రయాణికులు వెంటనే 108కి ఫోన్ చేశారు. 

108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే పెద్దఅప్పడు ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమాచారం తెలిసి ఎస్సై జి.భాస్కరరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా కళ్లముందు తిరగాడిన పెద్ద అప్పడు హఠాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.