రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు వయోపరిమితి తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా వయోపరిమితి సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు వయోపరిమితి తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా వయోపరిమితి సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా భర్తీచేసే ఉద్యోగాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయోపరిమితిని పెంచింది. ఈ మేరకు సబార్డినేట్స్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీయేతర వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.
ఇక, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా భర్తీచేసే ప్రభుత్వ ఉద్యోగాలకు ఓసీలకు వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అయితే తాజా ఉత్తర్వులతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి 39 సంవత్సరాలుగా ఉండనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నించే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లబ్ది చేకూరనుంది.
