కర్నూలు (kurnool) నగరంలోని రావేంద్ర (Raghavendra) , పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో (pullaiah engg college kurnool) దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. విషయంపై కళాశాల యాజమాన్యాలు గుట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
కర్నూలు (kurnool) నగరంలోని రావేంద్ర (Raghavendra) , పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో (pullaiah engg college kurnool) దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. విషయంపై కళాశాల యాజమాన్యాలు గుట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గురువారం రాత్రి కళాశాల హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులు ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు వైద్యులను హాస్టల్‌కు పిలిపించి.. అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్యం అందించారు.
రెండు కళాశాలల్లో మొత్తం 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురవ్వగా.. 15 మంది విద్యార్థుల పరిస్ధితి విషమంగానూ, 5 ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగానూ ఉన్నట్లు సమాచారం. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల పరిస్థితిపై కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. మరోవైపు 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు (food poisoning) గురికావడంతో హాస్టల్ లోని మిగతా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
