కాకినాడ : గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు
కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.