అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోరంట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరంతా ఉదయం విషం తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

వీరిని గమనించిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను సోమశేఖర్, మోహన్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.