కొబోయే అల్లుడికి 365 వంటకాలతో భోజనం పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాబోయే అల్లుడికి అత్తింటి వాళ్లు 365 వెరైటీ వంటకాలతో భోజనం పెట్టారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
నరసాపురం: గోదారోళ్లు అంటే మర్యాద.. మర్యాద అంటే గోదారోళ్లు అన్నంతలా ఉంటుంది. కొత్త అల్లుళ్లకు అత్తింటికి వస్తే మర్యాదలు మమూలుగా ఉండవు. కొత్త అల్లుడికి నచ్చిన వంటలతో పాటు వెరైటీ వంటకాలు చేసి పెడతారు. వద్దన్నా కొసరి కొసరి వడ్డిస్తారు. కొత్త జంటను పక్క పక్కన కూర్చోబెట్టి భోజనం పెడతారు. వెరైటీ వంటకాలను తినేవరకు వదిలిపెట్టరు.
కొత్త అల్లుళ్లు అత్తింటికి చేరుకొనే సమయం నుండి వెళ్లిపోయే వరకు ఈ మర్యాదలు కొనసాగుతాయి. సంక్రాంతి పండగకు అత్తింటికి వచ్చే అల్లుళ్ల మర్యాదలకు కొదవ ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాబోయే అల్లుడికి అత్తింటివారు 365 వంటకాలతో భోజనం పెట్టారు. కాబోయే వధూవరులను పక్కన పక్కన కూర్చోబెట్టి కొసరి కొసరి తినిపించారు.
West Godavari జిల్లా Narsapuram కు చెందిన ఓ వ్యక్తి తన మనవరాలికి ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. Sankranti పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించారు. అమ్మాయి తాతయ్య ఏకంగా 365 వంటకాలతో గోదారోళ్ల మర్యాద ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నిండిపోయింది. అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలు వండించారు.,
30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్ధాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేశారు.నరసాపురంకి చెందిన ఆచంట Govind, Nagamani దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవి. ఆమెను Tanuku కి చెందిన తుమ్మలపల్లి Sai krishna తో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. ఈ క్రమంలోనే కాబోయే నూతన వదూవరులకు, వదువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మర్యాదను రుచి చూపించారు.
