తిరుపతి: కరోనా పరీక్షల కోసం ఆసుపత్రి వద్దకు వెళ్తున్న యువకుడు తండ్రి కళ్ల ముందే కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకొంది.

తిరుపతి పట్టణానికి చెందిన  32 ఏళ్ల యువకుడు తండ్రితో కలిసి కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు ఆసుపత్రికి బయలుదేరాడు.  గురువారం నాడు మధ్యాహ్నం అలిపిరి లింకు రోడ్డు బస్టాండ్ వద్దకు చేరుకొన్నారు.

బస్టాండ్ వద్దకు చేరుకోగానే యువకుడు కుప్పకూలిపోయాడు. కొడుకును  లేపేందుకు తండ్రి తీవ్రంగా ప్రయత్నించాడు.  అయితే ఆ యువకుడు అప్పటికే మరణించాడు. అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూడ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదౌతున్నాయి. 

also read:బర్త్‌డేకు ఏర్పాట్లు, అంతలోనే విషాదం: కన్నీరు మున్నీరైన ఫ్యామిలీ

కేసులను తగ్గించేందుకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఆగష్టు 5వ తేదీ వరకు ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు అమలు చేసిన తర్వాత కరోనా కేసుల తీవ్రత తగ్గినట్టుగా  అధికారులు చెబుతున్నారు.

కళ్ల ముందే కొడుకు మరణించడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కరోనాతో ఈ రకమైన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం చోటు చేసుకొంటున్నాయి.

తమ కళ్ల ముందే కుటుంబసభ్యులు ప్రాణాలు విడుస్తున్నా ఏం చేయలేని స్థితిలో ఉంటున్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటాయి. తెలంగాణలో  కరోనా కేసులు 60 వేలు దాటాయి.