లారీ కింద పడి ముగ్గురు యువకులు దుర్మరణం

First Published 12, Feb 2019, 3:24 PM

లారీ కింద పడి ముగ్గురు యువకులు దుర్మరణం 

విశాఖ జిల్లాలోని రాయవరం మండలంలోని దర్మవరం గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదంలో కార్తిక్, సాయి, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు.

జాతియ రహదారిపై తుని నుంచి యలమంచలి వైపు వస్తున్న లారీని అదే దారిలో ద్విచక్ర వాహనం పై వస్తున్న ఈ ముగ్గురు యువకులు లారీ కింద పడి ఘోరంగా చనిపోయారు.

ఈ ప్రమాదాన్ని గమనించని లారీ డ్రైవర్ నాలుగు కి.మీ వెళ్లిపోయాడు. లారీ వెనుక చక్రంలో మృతదేహం ఇరుక్కుపోయిందన్న విషయాన్ని గమనించిన  స్థానికులు అది చూసి కేకలు వేయడంతో డ్రైవర్ లారీ ఆపాడు. వెనక చక్రంలో ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన రెండు మృతదేహాలు ఒకటి దర్మవరం వద్ద లభించగా, మరొకటి పులపర్తి గ్రామం వద్ద గుర్తించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వచ్చి ప్రమాదానికి గల కారణాన్ని  ఆరా తీశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాంతంలో ఇంతటి ఘోర ప్రమాదం సంభవించటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మృతులందరు దర్మవరం గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విసాద ఛాయలు అమలుకున్నాయి. ప్రమాదం జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో హైవే పై పోలీసులు ట్రాపిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.