ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో కారును లారీ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.
ప్రకాశం జిల్లాలో (prakasam district) దారుణం జరిగింది. కారులో మంటలు (fire accident) చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మార్కాపురం (markapur) మండలం తిప్పాయపాలెంలో ఈ ఘటన జరిగింది. దీంతో భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలంలోనే లారీని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
