ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 289 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,83,876కి చేరింది

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 289 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,83,876కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ఒక్కరోజు కోవిడ్ కారణంగా ముగ్గురు మరణించారు. గత 24 గంటల్లో 428 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,73,855కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,896 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 51,207 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 1,21,05,121కి చేరుకుంది.

అనంతపురం 15, చిత్తూరు 40, తూర్పుగోదావరి 39, గుంటూరు 42, కడప 11, కృష్ణ 27, కర్నూలు 7, నెల్లూరు 16, ప్రకాశం 2, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 40, విజయనగరం 9, పశ్చిమగోదావరిలలో 33 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

Scroll to load tweet…