గత కొన్నిరోజులుగా భారతదేశంలో సెకండ్ వేవ్ ప్రభావం బాగా కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్‌ నాటి పరిస్ధితులు మరోసారి కనిపిస్తున్నాయి. రోజుకు లక్షకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.

వైరస్‌ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, పంజాబ్‌లు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా ప్రభావం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,331 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,13,274కి చేరింది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

వీరితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,262కి చేరుకుంది. గత 24 గంటల్లో 853 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,92,736కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 13,276 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు 31,812 మందికి కోవిడ్ నిర్ధారణా పరీక్షలు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 1,53,02,583కి చేరింది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 202, చిత్తూరు 296, తూర్పుగోదావరి 29, గుంటూరు 368, కడప 149, కృష్ణా 327, కర్నూలు 176, నెల్లూరు 186, ప్రకాశం 110, శ్రీకాకుళం 123, విశాఖపట్నం 298, విజయనగరం 47, పశ్చిమ గోదావరిలలో 20 కేసులు చొప్పున నమోదయ్యాయి.