తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,164 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,87,603కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిన్న తగ్గినట్లే తగ్గిన కేసులు ఇవాళ మరోసారి పెరిగిపోయాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల సంఖ్యలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,164 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,87,603కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,707కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 11, అనంతపురం 8, తూర్పుగోదావరి 9, పశ్చిమ గోదావరి 8, చిత్తూరు 5, గుంటూరు 12, కర్నూలు 6, నెల్లూరు 7, కృష్ణ 5, ప్రకాశం 6, విశాఖపట్నం 10, శ్రీకాకుళం ఐదుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 18,832 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 10,88,264కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,05,494 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,73,67,935కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,90,632 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2039, చిత్తూరు 2169, తూర్పుగోదావరి 2844, గుంటూరు 2099, కడప 1267, కృష్ణ 1240, కర్నూలు 1568, నెల్లూరు 1574, ప్రకాశం 980, శ్రీకాకుళం 1432, విశాఖపట్నం 2206, విజయనగరం 998, పశ్చిమ గోదావరిలలో 1748 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు

Scroll to load tweet…