విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఆయన భార్య సారమ్మ అలియాస్ సుజాతను తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ ఇద్దరు మావోయిస్టులు విజయవాడలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరినీ విచారణ నిమిత్తం కొత్తగూడెంకు తరలించారు. అరెస్టు అయిన మావోయిస్టులు ఏటూరు నాగారం, కొత్తగూడెం ఏరియా మావోయిస్టు ప్రతినిధులుగా పనిచేసినట్లు సమాచారం. ఏ పనిమీద విజయవాడ వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.