చిత్తూరు జిల్లా కాసీపేట వద్ద  పూతలపట్టు రహదారి పై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
 మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు ఆస్పత్రికి తరలించారు మరో 30 మంది చెప్పారు 

నల్గొండ జిల్లా డిండి నుండి 30 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ బస్సులో 23 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. మరో ఏడుగురు మాత్రం అయ్యప్ప భక్తులు కాదు. 

అయ్యప్ప భక్తులు బుధవారం నాడు ఉదయం తిరుమలకు చేరుకొని వెంకన్నను దర్శించుకోవాల్సి ఉంది. కాసీపేట వద్ద ప్రమాదం చోటు చేసుకొంది. అమరావతికి వెళ్లే బస్సు ను ప్రైవేట్ బస్సు  ఢీకొట్టింది. మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రికి 30 మందిని తరలించారు. అమరావతి బస్సులో ఉన్నవారికి స్వల్పగాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరిద్దరూ మినహ మిగిలినవారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.