చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో గ్యాస్ గోడౌన్‌లో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు  తీవ్రంగా గాయపడ్డారు.అతడిని ఆసుపత్రికి తరలించారు. లిక్విడ్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మరణించారు. గ్యాస్ కట్టర్ తో వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

వెల్డింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.గతంలో కూడ చిత్తూరు జిల్లాలో వెల్డింగ్ చేసే షాపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. 

గ్యాస్ సిలిండర్ టోడౌన్ లో  నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారనే విషయమై కూడ అధికారులు ఆరా తీయనున్నారు.  ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను ఆదేశించారు.  ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకొందా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.