తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,354 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,01,690కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు 17 వేల మార్క్‌‌ను దాటాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు చోట్ల మినీ లాక్‌డౌన్ విధించగా, ప్రస్తుతం రాష్ట్రం మొత్తం నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది.

అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,354 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,01,690కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,992కి చేరింది. గత 24 గంటల్లో నెల్లూరు 8, విశాఖపట్నం 8, విజయనగరం 7, చిత్తూరు 6, తూర్పుగోదావరి 6, ప్రకాశం 6, అనంతపురం 5, గుంటూరు 4, కర్నూలు 4, పశ్చిమ గోదావరి 4, కృష్ణ 3, శ్రీకాకుళంలలో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

నిన్న కొత్తగా 8,468 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,70,718కి చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 86,494 మందికి కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు మొత్తం నిర్థారణా పరీక్షల సంఖ్య 1,63,90,360కి చేరింది. నిన్న ఒక్కరోజు అనంతపురం 1882, చిత్తూరు 2764, తూర్పుగోదావరి 1842, గుంటూరు 2129, కడప 757, కృష్ణ 698, కర్నూలు 967, నెల్లూరు 1133, ప్రకాశం 661, శ్రీకాకుళం 1581, విశాఖపట్నం 1358, విజయనగరం 740, పశ్చిమ గోదావరిలలో 842 మందికి పాజిటివ్‌గా తేలింది. 

Scroll to load tweet…