ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 166 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,74,250కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 166 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,74,250కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,495కి చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కోవిడ్‌తో నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 91 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,58,601కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,844 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,13,27,131కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1151 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 12, చిత్తూరు 28, తూర్పుగోదావరి 10, గుంటూరు 10, కడప 3, కృష్ణ 21, కర్నూలు 9, నెల్లూరు 13, ప్రకాశం 6, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 31, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 12 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు.. భారత్‌లో మరోసారి కరోనా అలజడి మొదలైంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా16,764 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,38,804 చేరింది. కరోనాతో తాజాగా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,81,080కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో.. కరోనా నుంచి 7,585 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,42,66,363కి చేరింది. ప్రస్తుతం దేశంలో 91,361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసులతో పోలిస్తే 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయిని.. ప్రస్తుతం ఇది 0.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతంగా ఉందని పేర్కొంది. 

Scroll to load tweet…