బాలికపై 15మంది యువకులు అత్యాచారం....ముగ్గురు మహిళల సాయంతో...

First Published 8, Sep 2018, 3:31 PM IST
15 People Gang Rape On 10th Class Student In Guntur District
Highlights

పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడిన యువకులకు బాలికకు పరిచయమున్న ముగ్గురు మహిళలె సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ బాలికపై త్రినాథ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత సంవత్సర కాలంగా యువతిపై  లైంగిక దాడి జరగుతుండగా తాజాగా గత నెల 29 న ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఈ కేసును విచారిస్తున్నకొద్దీ భయంకరమైన నిజాలు బైటపడుతున్నాయి. 

బాలికను ప్రేమ పేరుతో వంచించిన త్రినాథ్ తో పాటు అతడి స్నేహితులు ఏలూరి మోహన్ కృష్ణ, చిన్ని, ఇజ్రాయిల్, వలీ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు.పోలీసుల విచారణలో ఈ అత్యాచార ఘటనతో మరో 10 మంది యువకులకు కూడా సంబంధమున్నట్లు బైటపడింది. దీంతో మొత్తంగా 15 మంది యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

 అయితే బాధిత బాలికను ప్రేమలోకి దించడానికి, అత్యాచారం చేయడానికి యువకులకు ముగ్గురు మహిళలు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో  ఓ మహిళను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నట్లు సమాచారం.  

loader