ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం: 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

ధవళేశ్వరం నుండి 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో పోలవరం పనులు నిలిపివేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
 

15 lakh cusecs water releases From Dowleswaram barrage

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Dowleswaram barrage  వద్ద Godavari  వరద  పోటెత్తింది. కాటన్ బ్యారేజీ నుండి 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.  కాటన్ బ్యారేజీ వద్ద 15 అడుగుల మేర వరద నీరు ప్రవాహిస్తుంది. వరద నీరు 17 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Polavaram Project  కాఫర్ డ్యామ్  వద్ద 34.3 మీటర్ల వద్ద వరద నీరు చేరింది. పోలవరం స్పిల్ వే మీదుగా 12 లక్షల 70 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరికి వరద పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు నిటిచిపోయాయి. గోదావరికి వరద పోటెత్తడంతో పోలవరం ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

also read:పోటెత్తిన వరద: నేడు సాయంత్రానికి భద్రాచలం వద్ద 66 అడుగులకు చేరనున్న గోదావరి

ఇటీవల కాలంలో గోదావరి నదికి ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు.ఇంత పెద్ద మొత్తంలో వరదలు సాధారణంగా ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో వస్తాయి. కానీ అందుకు భిన్నంగా జూలై మాసంలోనే వరద రావడం రికార్డుగా చెబుతున్నారు. వంద ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ తరహ వరదలు రావడం చాలా అరుదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏలూరు, అల్లూరు సీతారామరాజు,ఉభయ గోదావరి జిల్లాలు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి పరివాహక  ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను గోదావరి పరివాహక ప్రాంతాల్లో మోహరించారు. మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

బుధవారం  సాయంత్రానికి గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  దీంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు  సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇవాళ సాయంత్రానికి  గోదావరి నది భద్రాచలం వద్ద 66 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios