తూర్పుగోదావరి జిల్లాలో ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అయినవిల్లి మండలం శాసనపల్లిలంక గ్రామంలో 12 ఏళ్ల బాలిక స్థానిక పంట కాలువ మీదుగా నడిచి వెళ్తోంది. ఈ క్రమంలో నలుపు రంగు కారులో వచ్చిన దుండుగులు ఎత్తుకెళ్లారు.

అయితే భార్యాభర్తల మధ్య వున్న గొడవలే బాలిక కిడ్నాప్‌కు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.