మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఈ మూడు జిల్లాల్లో తీవ్రత: ఏపీలో 8,90,884కి చేరిన కేసులు
ఏపీలో నిన్న కాస్త తెరిపినిచ్చిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 118 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,90,884కి చేరుకుంది.
ఏపీలో నిన్న కాస్త తెరిపినిచ్చిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 118 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,90,884కి చేరుకుంది. కోవిడ్ వల్ల గత 24 గంటల్లో ఎటువంటి మరణం సంభవించలేదు. నిన్నటి వరకు రాష్ట్రంలో వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,176కి చేరింది.
ప్రస్తుతం ఏపీలో 1,038 యాక్టివ్ కేసులు వున్నాయి. గడిచిన 24 గంటల్లో 89 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,82,670కి చేరింది.
నిన్న 45,079 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించడంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో టెస్టుల సంఖ్య 1,43,07,165కి చేరుకుంది. గత 24 గంటల్లో అనంతపురం 4, చిత్తూరు 38, తూర్పుగోదావరి 11, గుంటూరు 12, కడప 5, కృష్ణ 21, కర్నూలు 2, నెల్లూరు 4, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 15, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి.