ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 114 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కి చేరింది.

నిన్న కరోనా కారణంగా ఏ ఒక్కరూ చనిపోలేదని ప్రభుత్వం వెల్లడించింది. నిన్నటి వరకు మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 7,139గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,987 యాక్టీవ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 326 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,76,698కి చేరింది. నిన్న 25,542 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయడంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,25,40,181కి చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 3, చిత్తూరు 24, తూర్పు గోదావరి 13, గుంటూరు 6, కడప 2, కృష్ణా 12, కర్నూలు 8, నెల్లూరు 10, ప్రకాశం 1, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 22, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 4 కేసులు నమోదయ్యాయి.