Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల ఎదురుచూపులో పుట్టిన బిడ్డ.. చిన్న డబ్బా గొంతులో ఇరుక్కుని గింజుకుంటూ దుర్మరణం.. ఏపీలో విషాదం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరం రోజే ఓ ఇంటిని విషాదం అలుముకుంది. 20 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత జన్మించిన చిన్నారి బాలుడు మెంతో ప్లస్ తైలం డబ్బాను ఆడుకుంటూ నోట్లో వేసుకున్నాడు. అది గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ఆ బాలుడు మరణించాడు.
 

10 months baby boy dies after mentho plus oil box stuck in his throat in andhra pradeshs kurnool
Author
First Published Jan 2, 2023, 1:27 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం రోజునే విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటిని శోకసంద్రంలో ముంచింది. 20 ఏళ్లు ఎదురుచూసిన తర్వాత పుట్టిన బిడ్డను ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తీరా ఏడాది కూడా నిండకముందే.. పది నెలల ఆ పసికందు ఊహించని విధంగా కళ్లముందే గింజుకుంటూ మరణించిన ఘటన తల్లిదండ్రులను దిగ్భ్రాంతిలోకి నెట్టింది. మెంతో ప్లస్ తైలం డబ్బాను ఆడుకుంటూ నోట్లో వేసుకున్నాడు. ఆ డబ్బా గొంతులోకి జారింది. చిన్నారికి ఊపిరాడకుండా చేసింది. హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగానే మార్గంమాధ్యంలోనే ప్రాణాలు వదిలాడు ఆ బాలుడు. తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటన కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం చింతమానుపల్లెలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన నల్లన్న, సువర్ణ దంపతులు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. 20 ఏళ్ల తర్వాత వారి కల నెరవేరింది. పండంటి బాబుకు దంపతులు జన్మనిచ్చారు. కానీ, ఆ సుదీర్ఘ ఎదురుచూపుల ఫలాలు పది నెలల్లోనే ఆవిరైపోయాయి.

Also Read: దారుణం : డాక్టర్ల కోసం ఎదురుచూపులు, చివరికి తల్లి చేతుల్లోనే ప్రాణం వదిలిన చిన్నారి

ఆ డబ్బాతో ఆడుకుంటున్న బాబు దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది ప్రమాదవశాత్తు గొంతులోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆ డబ్బాను నోట్లో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాల సఫలం కాలేవు. దీంతో హాస్పిటల్‌కు బయల్దేరారు. కానీ, హాస్పిటల్ చేరకముందే ఆ చిన్నారి బాలుడు ప్రాణాలు వదిలాడు. కళ్లముందే ప్రాణమంతటి కొడుకు ప్రాణాలు పోవడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ డబ్బా గొంతులో ఇరుక్కోవడం మూలంగానే ఆ బాలుడు మరణించినట్టు వైద్యులు చెప్పారు.

పిల్లలు తమ ఆటల్లో మునిగి ఆడుకుంటున్నప్పటికీ పెద్దలు ఎప్పుడూ వారిపై ఓ కన్నేసి ఉంచాలని పెద్దలు అందుకే చెబుతారు. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూనే ఉండాలి. అమాయకత్వంతో వారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలమీదకు తెస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios