అనకాపల్లి  జిల్లాలోని  అచ్యుతాపురం సెజ్ లో  గల ఫార్మా కంపెనీలో మంగళవారం నాడు రియాక్టర్ పేలింది.  ఈ పేలుడులో  ఒకరు మృతి చెందారు.  

అనకాపల్లి:  అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం   సెజ్ లో  గల జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో మంగళవారంనాడు పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో  ఒకరు మృతి చెందారు. మ రో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.  భారీ శబ్దంతో రియాక్టర్ పేలిందని  స్థానికులు చెబుతున్నారు.  రియాక్టర్ పేలడంతో   ఈ కంపెనీలో  పనిచేస్తున్న కార్మికులు  భయంతో పరుగులు తీశారు.  

రియాక్టర్ పేలుడుతో  ఈ కంపెనీలో  మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నమాపక సిబ్బంది  ఫార్మా కంపెనీకి  చేరుకుని  మంటలను ఆర్పుతున్నారు.   రియాక్టర్ పేలుడుతో  అక్కడే  విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  రియాక్టర్ పేలుడుతో  చెలరేగిన మంటల కారణంగా  కార్మికులకు మంటలు అంటుకుని గాయపడినట్టుగా  సమాచారం.  ప్రమాదం జరిగిన స్థలంలో  ఒక కార్మికులు  మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో  ముగ్గురు కార్మికులను   ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  ముగ్గురు కార్మికులు  చికిత్స పొందుతున్నారు.   రియాక్టర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.