ఈ ఒక్క దానితో.. దిండు కవర్ల మురికి ఈజీగా పోతుంది

By Shivaleela Rajamoni  |  First Published Jan 3, 2025, 12:42 PM IST

దిండ్లను ఉతకడం వీలు కాదు. కాబట్టి వాటికి వర్లను తొడుగుతుంటాం. కానీ వీటిని తరచుగా ఉతుకుతుండాలి. లేదంటే మురికిగా మారుతాయి. అయితే ఒకదానితో ఈ కవర్లను ఈజీగా పోగొట్టొచ్చు.


మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క ఫుడ్ విషయంలోనే కాదు.. వేసుకునే దుస్తుల నుంచి పడుకోవడానికి ఉపయోగించే బెడ్ షీట్లు, దిండ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ స్నానం చేస్తుంటాాం. అలాగే శుభ్రమైన దుస్తులను వేసుకుంటాం. మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటాం. 

Latest Videos

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ ఉపయోగించే వస్తువు కూడా శుభ్రంగా ఉండాలి. వాటిలో దిండ్లు కూడా ఉన్నాయి. అవును దిండు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయి. నిజానికి దిండ్లను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. కానీ వీటిని మాత్రం క్లీన్ చేయరు. దీనివల్ల వాటికి నెత్తి నూనె, దుమ్ము, ధూళి మురికి బాగా పట్టుకుంటాయి. వీటిని ఇలాగే ఉపయోగిస్తే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొంతమంది వీటిని క్లీన్ చేస్తుంటారు. కానీ అవి పూర్తిగా క్లీన్ కావు. నిజానికి వీటిని ఎలా క్లీన్ చేయాలో ఆడవాళ్లకు తెలియదు.

మనం ఉపయోగించే దిండ్లకు చెమట, నూనె,  చనిపోయిన చర్మ కణాలు వంటివి అంటుకుంటాయి. వీటివల్ల మన జుట్టు దెబ్బతింటుంది. ముఖ్యంగా నూనె వల్ల దిండు కవర్ జిడ్డుగా, మురికిగా మారుతుంది. ఇలాంటి వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. అందుకే నూనె మరకలు అంటిన దిండు కలర్లను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇది కూడా చదవండి:  ఈ ఒక్కటి పెట్టినా నెత్తిమీద చుండ్రు ఉండదు.. వెంట్రుకలు రాలవు

వేడి నీళ్లతో శుభ్రం చేయండి:

దిండు కవర్లకు అంటిన నూనె మరకలను పోగొట్టాలంటే ముందుగా వీటిని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. ఇందుకోసం బకెట్ వేడి నీళ్లను తీసుకుని దాంట్లో దిండు కవర్లను కొద్దిసేపు నానబెట్టండి. దీనిలో క్లాత్ వాషింగ్ లిక్విడ్ ను కలపండి. ఆ తర్వాత వీటిని ఉతికి నార్మల్ వాటర్ తో శుభ్రం చేసి ఎండలో ఆరబెడితే సరిపోతుంది. 

బేకింగ్ సోడా:

దిండు కవర్లను తెల్లగా తలతల మెరిసేలా చేయడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నూనె, దుమ్ము, ధూళి మరకలున్న దిండు కవర్లపై బేకింగ్ సోడాను చల్లండి. 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచి నీళ్లతో శుభ్రం చేయండి. దీనివల్ల దిండు కవర్ కు అంటిన జిడ్దు, మురికి పూర్తిగా పోతాయి. 

చల్లని నీళ్లు:

చల్ల నీల్లతో కూడా దిండు కవర్లకు అంటిని మురికిని పూర్తిగా పోగొట్టొచ్చు. ఇందుకోసం బకెట్ చల్ల నీటిలో దిండు కవర్లను ఒక 30 నిమిషాల పాటు నానబెట్టండి. అయితే దీనిలో రెండు చుక్కల షాంపూను కూడా కలపండి. ఆ తర్వాత బ్రష్‌తో తో దిండు కవర్ ను రుద్ది క్లీన్ చేయండి. ఇలా చేస్తే దిండు కవర్లకు అంటిన నూనె మరకలు లేకుండా పోతాయి. 

ఇది కూడా చదవండి: దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

గుర్తుంచుకోండి:

 - దిండు కవర్లకు ఎక్కువగా మురికి పట్టకూడదంటే రెండు దిండు కవర్లను తొడగాలి. ఇలా చేయడం వల్ల దిండు కవర్లకు నూనె ఎక్కువగా అంటుకోదు. అలాగే లేత రంగులకు బదులుగా ముదురు రంగు దిండు కవర్లను ఉపయోగిస్తే మంచిది. 

-  దిండు కవర్లు ఎక్కువగా మురికిగా కాకూడదంటే వీటిని తరచుగా మారుస్తుండాలి. 

-  దిండు కవర్ల క్లాత్ ను బట్టి వేడి నీళ్లతో ఉతకాలి. 

-  దిండ్లను ఎండలో ఆరబెట్టి ఉపయోగించండి.

click me!