Hair Growth: ఇవి ఫాలో అయితే జుట్టు రాలదు, ఒత్తుగా పెరుగుతుంది..!

Published : Jun 19, 2025, 04:37 PM IST
eucalyptus oil for hair growth

సారాంశం

జుట్టు హెల్దీగా, అందంగా కనిపించాలంటే చాలా కష్టపడాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, అంత పెద్ద కష్టమేమీ కాదు..కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు.

ఒత్తైన, పొడవాటి జుట్టు కోసం చాలా మంది చాలా కలలు కంటారు. కానీ.. ఈ రోజుల్లో జుట్టురాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, మంచి నిద్ర లేకపోవడం, కాలుష్యం, కెమికల్స్ తో నిండిన హెయిర్ ఆయిల్స్, షాంపూలు, ఇతర హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం ఇవన్నీ కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. మరి.. ఖరీదైన బయట దొరికే ఉత్పత్తులు ఏవీ వాడకుండానే.. జుట్టు ఆరోగ్యంగా , అందంగా మారాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? దాని కోసం మనం రెగ్యులర్ గా కొన్ని నియమాలు ఫాలో అయితే చాలు.

జుట్టు హెల్దీగా, అందంగా కనిపించాలంటే చాలా కష్టపడాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, అంత పెద్ద కష్టమేమీ కాదు..కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు. సరైన అలవాట్లు, కొంచెం మనసుతో శ్రద్ధ పెడితే ఇది సాధ్యం అవుతుంది. సరైన ఆరోగ్యం తీసుకుంటూ, తలకు రెగ్యులర్ గా మసాజ్ చేస్తూ, సరైన ఉత్పతులు ఎంచుకుంటే సహజంగానే జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.

1. ఆరోగ్యకరమైన జుట్టుకు కోసం తీసుకోవాల్సిన ఆహారాలు..

మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఆహారంలో ప్రోటీన్, ఐరన్, బయోటిన్, విటమిన్ A, C, E, ఒమేగా‑3లు ఉండాలి. జుట్టు ప్రధానంగా క్యరాటిన్ (ప్రోటీన్ రకం) తో తయారవుతుంది. అందుకే ప్రతి రోజూ ఈ ఆహారాలు తీసుకోవడం మంచిది:

ప్రోటీన్ – గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, పన్నీర్

బయోటిన్ – బాదం, వాల్‌నట్, బీన్స్, పాలకూర, చిలగడదుంపలు

ఐరన్ – ఆకు కూరలు, ఎర్ర మాంసం, బీన్స్, బీట్‌రూట్

ఓమేగా‑3 – సాల్మన్, మాకరెల్, ఆవ నూనె, వాల్‌నట్

విటమిన్లు – క్యారెట్, మామిడి, స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలు, ఆలివ్ ఆయిల్

ఈ ఆహారపు సమాహారంతో మీరు మీ జుట్టుకు లోపల నుంచే మంచి పోషణ అందించవచ్చు. ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అందంగా కూడా కనపడుతుంది.

2. హెడ్ మసాజ్ – రక్తప్రసరణ, జుట్టుకు పోషణ

రోజు 2‑3 నిమిషాలు తలలో నెమ్మదిగా సహజ కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. మీరు హెడ్ మసాజ్ కొబ్బరి నూనె, ఆముదం, రోజ్మేరీ ఆయిల్ వంటి వాటితో చేయవచ్చు. ఇవన్నీ జుట్టును హెల్దీగా మారుస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

3. కెమికల్స్ లేని ఉత్పత్తులు వాడటం..

కెమికల్స్ లేకుండా, ఘాఢత తక్కువగా ఉండే షాంపూలు, కండిషనర్లు వాడాలి. అంటే పాతకాలంలాగా కుంకుడు కాయలు, షీకాకాయలు వాడాలని రూల్ ఏమీ లేదు. మీరు మార్కెట్ లో దొరికే వాటినే ఎంచుకోవచ్చు. కానీ.. మీరు షాంపూ, కండిషనర్ తీసుకునేటప్పుడు సల్ఫేట్, పారాబెన్, కెమికల్స్ లేని ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి.. మీ జుట్టును డ్యామేజ్ చేయవు. ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా చేస్తాయి.

4.జుట్టుకు హీట్ ప్రొడక్ట్స్ వాడకం..

జుట్టుకు వేడి ఎక్కువగా ఉండే ఉత్పతులను వాడకూడదు. అంటే.. తలస్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రయ్యర్, బ్లో డ్రయ్యర్లు, స్ట్రైట్నర్స్ లాంటివి వాడటం ఆపేయాలి. లేదు.. కచ్చితంగా వాడాలి అనుకుంటే.. దానికి ముందు హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే కచ్చితంగా వాడాలి. వాటిని స్ప్రే చేసిన తర్వాత వాడితే, జుట్టు పెద్దగా డ్యామేజ్ అవ్వదు. వీలైనంత వరకు వీటిని వాడకపోవడమే మంచిది.

5.రెగ్యులర్ గా జుట్టు కత్తిరించడం..

జుట్టు చిట్లిపోకుండా, మంచిగా పెరగాలి అనుకుంటే.. రెగ్యులర్ గా హెయిర్ కట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా జుట్టు చివరలను, చిట్లిన వెంట్రుకలను కత్తిరిస్తూ ఉండాలి. కనీసం రెండు నెలలకు ఒకసారి ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా కనపడుతుంది.

6. హైడ్రేషన్ – లోపల నుంచీ

రోజుకు 2‑3 లీటర్లు నీరు తాగడం వల్ల శరీరంలో తేమ ఉంటుంది. తల చర్మం, జుట్టు కుదుళ్లు – ఇవంతా శక్తిగా పని చేస్తాయి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

7. సిల్క్ పిల్లోకేస్ వాడటం..

దాదాపు అందరూ తమ దిండు కవర్లుగా కాటన్ ఫ్రాబ్రిక్ వాడుతూ ఉంటారు. కానీ.. కాటన్ ఫ్రాబ్రిక్ జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. దానికి బదులుగా మీరు సిల్క్ పిల్లో కవర్లు వాడాలి. సిల్క్ పిల్లో కవర్స్ రాత్రి పడుకొనేటప్పుడు జుట్టు చిక్కు పడేలా చేయవు. దాని వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.

8.తలస్నానం ఎన్ని సార్లు చేయాలి?

చాలా మంది ప్రతిరోజూ తలస్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ, రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల కూడా ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. రోజూ షాంపూ చేయడం వల్ల తలలో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. దాని వల్ల జుట్టు ఎండిపోయినట్లుగా, గడ్డిలా మారుతుంది. అలా కాకుండా, వారానికి రెండు లేదా మూడు సార్లకు మించి తలస్నానం చేయకూడదు.అది కూడా సల్ఫేట్ లేని షాంపూలు ఎంచుకోవాలి. తలస్నాం చేసే నీరు కూడా వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉండాలి.

9. హెల్దీ హెయిర్ కోసం సప్లిమెంట్స్ వాడటం..

ప్రతి రోజూ సరైన పోషకాలు తీసుకున్నా కూడా కొంతమంది వారు సప్లిమెంట్లతో అదనపు సపోర్ట్ పొందచ్చు. బయోటిన్, విటమిన్ A, C, E, జింక్, వైటమిన్ D వంటి అవసరాలను నిపుణుల సూచన ప్రకారమే ప్రారంభించండి. వైద్యుల సలహా తీసుకోవచ్చు.

10.పర్యావరణం నుంచి జుట్టు సంరక్షణ

UV కిరణాలు, వాతావరణ కాలుష్యం వీటివల్ల జుట్టు బ్రేక్ అవటం, ఎండిపోయినట్లుగా మారుతుంది. టోపీ, స్కార్ఫ్, లేదా UV‑ప్రొటెక్టివ్ హెయిర్‌ప్రాడక్ట్స్‌ వాడండి. ఇది పోషకాన్ని పదిలంగా నిలబెట్టడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఫైనల్ గా...

ఈ 10 పూర్తిస్థాయి చిట్కాలు మీ జుట్టును పొడవుగా, మెరిసేలా, ఆరోగ్యంగా పెంచుకునే మార్గాన్ని చూపిస్తాయి. రెండు, మూడు రోజులు చేసి ఆపేయకుండా.. కనీసం 10 రోజుల పాటు అయినా దీనిని ఫాలో అవ్వాలి. అప్పుడు.. ఆరోగ్యకరమైన జుట్టును పొందుతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hair Oil: చలికాలంలో ఈ నూనెలు రాస్తే.... ఒక్క వెంట్రుక కూడా రాలేదు, ఒత్తుగా పెరుగుతుంది..!
బంగారానికి ఏమాత్రం తీసిపోని నెక్లెస్‌లు.. ధర కూడా తక్కువే!