Braiding Hair: జడ వేసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే ఇంకోసారి జుట్టు వదిలేయరు!

Published : Jun 15, 2025, 03:40 PM IST
Braiding Hair: జడ వేసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే ఇంకోసారి జుట్టు వదిలేయరు!

సారాంశం

పొడవాటి జడ ఉంటే బాగుండని చాలామంది అనుకుంటారు. జడ.. ఆడవాళ్ల అందాన్ని పెంచడమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిదట. జుట్టును వదిలేసుకోవడం కంటే.. జడ వేసుకుంటేనే మంచిదట. మరి రోజూ జడ వేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూసేయండి.  

హిందూ సంప్రదాయంలో జడకు ప్రత్యేక స్థానం ఉంది. అమ్మాయిల అందానికి ప్రతీకగా జుట్టుని భావిస్తారు. జుట్టు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. సందర్భాన్ని బట్టి ఆడవాళ్లు రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తుంటారు. అయితే ఈ తరం అమ్మాయిలు ఎక్కువగా జడ వేసుకోవడం కంటే వదిలేయడానికే ఇష్టపడుతున్నారు. కానీ జడ వేసుకుంటే కలిగే లాభాలేంటో తెలిస్తే.. ఇంకోసారి జుట్టును విరబోసుకోరు. మరి జడ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా..

జడ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

జడ వేసుకోవడం లేదా జుట్టు కట్టుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. జడ.. అందం కోసమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందట. కొంతమంది జడ వేసుకోవడం అలంకారం కోసమే అనుకుంటారు. అందుకే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జడ వేసుకుని, దానికి రకరకాల అలంకారాలు చేస్తారు. సాధారణంగా జుట్టు వదిలేసుకున్న అమ్మాయిల కన్నా జడ వేసుకున్న అమ్మాయిలు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ప్రతిరోజూ జుట్టు వదిలేసుకునే బదులు జడ వేసుకుంటే మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు చూడవచ్చు.

ప్రతిరోజూ జడ వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో నీరు, గాలి అన్నీ కాలుష్యంతో నిండి ఉన్నాయి. దీనివల్ల జుట్టు చిట్లిపోయే అవకాశం ఎక్కువ. అంతేకాదు జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. జుట్టు పలుచబడుతుంది. ప్రతిరోజూ రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉండడానికి రకరకాల పరికరాలు, పదార్థాలు వాడడం వల్ల కూడా జుట్టు చివర్లు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే జుట్టు కట్టుకుంటే దానికి పోషణ లభిస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోయే సమస్య తగ్గుతుంది. జుట్టు రాలదు. ఆరోగ్యంగా పెరుగుతుంది.  

జడ వేసుకుంటే తలపై తేమను నిలుపుకోవచ్చు. జుట్టు బలంగా పెరగాలంటే నెత్తిమీద చర్మం ఆరోగ్యంగా ఉండాలి. తలపై చర్మం ఎండిపోతే చుండ్రు వచ్చే అవకాశం ఉంది. చుండ్రు సమస్య మొదలైతే జుట్టు ఆరోగ్యంగా పెరగదు. ముఖం మీద మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. నెత్తిమీద చర్మం ఎండిపోకుండా ఉండాలంటే వారంలో రెండు సార్లు కొబ్బరి నూనె రాసుకుని, రాత్రి జడ వేసుకోవడం మంచిది. ఇది నెత్తిమీద ఫంగస్ సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు కుదుళ్లలో ఎక్కువ సేపు తేమ నిలుపుకుంటుంది. దీనివల్ల తల దురద, చుండ్రు సమస్యలు రావు. ఇవన్నీ కాకుండా జుట్టు వదిలేస్తే చెడు శక్తులు శరీరం మీద ప్రభావం చూపుతాయి అని కూడా పెద్దలు చెబుతుంటారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Silver Chain: వెయ్యి రూపాయల్లో వెండి చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
Hair Oil: చలికాలంలో ఈ నూనెలు రాస్తే.... ఒక్క వెంట్రుక కూడా రాలేదు, ఒత్తుగా పెరుగుతుంది..!