Grey Hair: ఈ నూనె రాస్తే, తెల్ల జుట్టు సమస్య అనేదే ఉండదు..!

Published : May 14, 2025, 03:42 PM IST
Grey Hair: ఈ నూనె రాస్తే, తెల్ల జుట్టు సమస్య అనేదే ఉండదు..!

సారాంశం

తెల్ల జుట్టుకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? డాక్టర్ ఉపాసన చెప్పిన ఈ నూనెతో ఇంట్లోనే సులభంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఈ నూనె తయారీ గురించి ఇక్కడ తెలుసుకోండి.

తెల్ల జుట్టుకు చెక్: ఒకప్పుడు వయసు పైబడిన వారికే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు సమస్య వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, తినే ఆహారం, కెమికల్స్ ఉన్న హెయిర్ డ్రై వల్ల ఇలా జరుగుతుంది. డాక్టర్ ఉపాసన ఒక సింపుల్ రెమిడీ చెప్పారు. దాంతో ఇంట్లోనే నూనె తయారు చేసుకోవచ్చు.

నువ్వుల నూనెతో ఇంటి చిట్కా

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే నువ్వుల నూనెతో ఈ నూనె తయారు చేసుకోవాలి. చాలా మంది ఈ రెమిడీని ట్రై చేసి మంచి ఫలితం పొందారు. ఈ నూనె తయారీకి రెండే రెండు పదార్థాలు కావాలి.

నువ్వుల నూనె- 1 లీటర్

నిమ్మరసం- 2 స్పూన్లు

తయారీ విధానం

ఒక కడాయిలో లీటర్ నువ్వుల నూనె పోసి, సన్నని మంట మీద కాచాలి. నూనెలో నురగ వచ్చాక, 2 స్పూన్ల నిమ్మరసం కలపాలి. నురగ ఇంకా ఎక్కువగా వస్తుంది. నూనెని ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. నురగ తగ్గే వరకూ నూనెని మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనెలో ఉన్న మలినాలని తీసేయాలి.

రెండు రోజులు నూనెని మరిగించాలి

24 గంటల తర్వాత మళ్ళీ నూనెని సన్నని మంట మీద కాచాలి. ఈసారి నిమ్మరసం కలపకూడదు. నురగ తగ్గే వరకూ మరిగించాలి. మూడో రోజు కూడా అంటే 24 గంటల తర్వాత మళ్ళీ నూనెని మరిగించాలి. తర్వాత నూనె చల్లారాక, వడకట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి ఈ నూనెని జుట్టుకు పట్టించాలి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేవారికి, 40 ఏళ్ళు పైబడిన వారికి ఇది చాలా మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
ABC Juice: చలికాలంలో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!