
సింపుల్ గొలుసు మెడలో అందంగా ఉంటుంది. కానీ దానికి ఒక యూనిక్ పెండెంట్ ఉంటే మీ మెడ అందం రెట్టింపవుతుంది. బంగారం ధరలు పెరుగుతున్న వేళ తక్కువ గ్రాముల్లో మంచి పెండెంట్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. కేవలం 3 గ్రాముల్లోనే తయారయ్యే బంగారు పెండెంట్ డిజైన్‌లు ఇక్కడ ఉన్నాయి. డైలీ వేర్, ఫెస్టివ్ వేర్.. రెండింటికీ అద్భుతమైన ఎంపిక. ఓసారి చూసేయండి.
ఫ్లవర్ డిజైన్ పెండెంట్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. 2 గ్రాముల బంగారంతో మీరు అందమైన పెండెంట్‌ను చేయించుకోవచ్చు. ఇది మెడలో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఈ పెండెంట్ ను మీరు ఏ దుస్తులతో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు.
లెటర్ పెండెంట్
మీ పేరులోని మొదటి అక్షరాన్ని లేదా మీకు ఇష్టమైన వారి పేరులోని మొదటి అక్షరాన్ని ఇలా పెండెంట్ చేయించుకోవచ్చు. ఇది 1-2 గ్రాముల్లో తయారవుతుంది. ఈ లాకెట్ చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది.
పక్షి పెండెంట్
స్వేచ్ఛను కోరుకునే మహిళలు ఇలాంటి పక్షి పెండెంట్‌ను ధరించవచ్చు. 2 గ్రాముల కంటే తక్కువ బరువులో కూడా మీరు పక్షి పెండెంట్‌ను చేయించుకోవచ్చు. ఇది చాలా అందంగా, యూనిక్ గా ఉంటుంది.
శంఖు షేప్ పెండెంట్
మీరు ఏదైనా ప్రత్యేకమైన బంగారు పెండెంట్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ 3 డిజైన్‌లను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ పెండెంట్లు మీ మెడలో చాలా అందంగా కనిపిస్తాయి. ట్రెడిషనల్, వెస్ట్రన్ ఇలా ఏ దుస్తులు వేసుకున్నా ఈ పెండెంట్లు చాలా అందంగా కనిపిస్తాయి.
రంగురంగుల రాళ్ల పెండెంట్
మీరు సింపుల్, క్లాసిక్ పెండెంట్‌ను చైన్ తో జోడించాలనుకుంటే ఇలాంటి రంగురంగుల రాళ్లు లేదా హార్ట్ షేప్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇవి రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిని 2 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బంగారంతో కూడా చేయించుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్లే అమ్మాయిల మెడలో ఈ లాకెట్స్ చాలా అందంగా కనిపిస్తాయి.